అమితాబ్ బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఈసారి ఆయన అలీబాగ్‌లో 7 ఎకరాల Land కొనడం ద్వారా వార్తలో నిలిచాడు.
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ నుంచి బచ్చన్ ఈ ఆస్తిని కొన్నట్లు సమాచారం.
ముంబై సిటీ రణగొణ ధ్వనులకు దూరంగా.. అరేబియా సముద్రాన్ని చూస్తూ.. ప్రశాంతంగా గడపాలన్నది ఆయన ఉద్దేశ్యమని తెలుస్తోంది.
అందుకే... ఆయన తనకు ఇష్టమైన రీతిలో ఒక లగ్జరీ విల్లాను కట్టుకుంటాడని తెలిసింది.
బిగ్ బి ఈ ప్రాపర్టీని కొనడంతో బాలీవుడ్‌లోని అందరి దృష్టి ఆ ప్రాంతం మీద పడుతుందని రియల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.