Cyber Crime: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు..


సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు

1) WhatsApp, సోషల్ మీడియా Paltforms, డేటింగ్ Apps లో తెలియని సందేశాలకు ఎప్పుడూ Reply ఇవ్వవద్దు.

2) ఎవరైనా మిమ్మల్ని కొన్ని కొత్త యాప్ లను డౌన్లోడ్ చేయమని లేదా లింక్లను తెరవమని అడిగితే, అది డేంజర్ అని గుర్తించుకోండి.

3) ఈ స్కాము ఆశలు, భయాలు, కలలు, దురాశ వంటి మీ భావోద్వేగాలను ఉపయోగించుకోవడంపై ఆధారపడతాయి. ఎప్పుడూ తొందరపడి స్పందించకండి.

చాలా మంది హడావుడిగా స్పందించడం వల్లనే ఈమోసాల బారిన పడుతున్నారు.

4) సందేహాలుంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లండి లేదా లాయర్ తో మాట్లాడండి.

5) ఎవరైనా ఉద్యోగం లేదా అధిక రాబడి వంటి వాటిని వాగ్దానం చేస్తే లేదా డబ్బు కోసం మిమ్మల్ని అడిగితే... అది మోసానికి దారి తీస్తుందని గుర్తుంచుకోండి.

6) మీ ఆధార్, Passport వంటి వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని లేదా బ్యాంక్ వివరాలు, పెట్టుబడి వివరాలు మొదలైన మీ ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు.

సైబర్ నేరాలపై ఫిర్యాదుల కొరకు 1930 సంప్రదించండి.

మరియు www.cybercrime.gov.in లాగిన్ అవ్వండి.