Jagan Support: జగన్ ... బిజెపికే మా ఫుల్ సపోర్ట్..!!


Jagan Support: జగన్ ... బిజెపికే మా ఫుల్ సపోర్ట్..!! 

ఒక్క ఓటమితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా దారుణంగా మారింది.

ఇలా అధికారాన్ని కోల్పోగానే అలా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి.

ప్రజా ధనం దుర్వినియోగం చేసారని, ప్రభుత్వ ఫర్నీచర్ సొంతానికి వాడుకున్నాడని, అధికారంలో వుండగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడంటూ జగన్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇలా జగన్ ఎక్కడ దొరుకుతాడా... ఎలా ఆటాడుకుందామా అని ఎదురుచూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.

ఇది ఇలా ఉండగా మరో దారుణం ఏమిటంటే...
చివరకు తమను ఓడించిన పార్టీకే 
మద్దతివ్వాల్సిన పరిస్థితి YSRCP కు వచ్చింది.

ఏ కూటమి చేతిలో అయితే చిత్తుగా ఓడిపోయారో అదే కూటమికి కేంద్రంలో మద్దతిస్తోంది YSRCP.

లోక్ సభ స్పీకర్ ఎన్నికల్లో బిజెపి నేత‌ృత్వంలోని NDA కూటమికే వైఎస్ జగన్ పార్టీ మద్దతిస్తోంది.

ఇలా YSRCP నలుగురు ఎంపీ ల మద్దతు కూడా NDA కు దక్కింది.