ప్రముఖ రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.5వేల కోట్ల సమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది అని తెలుస్తుంది.
తమ సంస్థాగత పెట్టుబడుల్లో Shares అమ్మకం, Hotel వ్యాపారం నుంచి ఈ మొత్తాన్ని సమీకరించాలని యోచిస్తోంది.
ఈ మేరకు తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వివరాలు వెల్లడించింది.
ఈక్విటీ షేర్లు లేదా ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5వేల కోట్లకు మించకుండా మొత్తాన్ని సమీకరించడానికి Company Board ఆమోదం తెలిపినట్టు పేర్కొంది.
అలాగే తన అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ లిమిటెడ్ ఆస్తులను మానిటైజ్ చేయడానికి కూడా Board ఆమోదం తెలిపినట్టు వెల్లడించింది.
అయితే, ఈ నిర్ణయాలన్నీ Share Holders ఆమోదానికి లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఆతిథ్య రంగంలోని ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ పర్యవేక్షించడానికి Board ఒక Sub Committee ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది.