శృంగారం అంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే..!
శృంగారం భార్యాభర్తల బంధాన్ని బలంగా మార్చడమే కాకుండా.... ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది.
అలాగే వీరిని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. కానీ కొంతమందికి శృంగారం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే?
వేగంగా మారుతున్న కాలంలో పాటుగా మన అలవాట్లు కూడా మారిపోతున్నాయి.
ముఖ్యంగా ఒకప్పటిలా కాకుండా శృంగారం గురించి అమ్మాయిలు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు.
వారికేం కావాలో భాగస్వామికి చెప్పేస్తున్నారు. అయితే కొంతమంది ఆడవారికి మాత్రం సెక్స్ అంటే విసుగు వస్తుంటుంది.
సెక్స్ అంటే మొహం తిప్పేస్తుంటారు. అయితే ఆడవాళ్లకు సెక్స్ అంటే ఇష్టం లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
ఒత్తిడి:
ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు.
చూడటానికి ఇది చిన్న సమస్యగా కనిపించినా.. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఒత్తిడి వల్ల కూడా ఆడవాళ్లు సెక్స్ లో పాల్గొనలేరు. ఇంటి పని, ఆఫీసు పని, ఫ్యూచర్ ఆలోచనలు ఆడవాళ్లను ఎంతో ఒత్తిడికి గురి చేస్తాయి.
ఏ కారణంతోనైనా మీరు మానసికంగా రిలాక్స్ కానప్పుడు సెక్స్ లో పాల్గొనలేరు. సెక్స్ అనేది స్ట్రెస్ బస్టర్ అయినా.. స్ట్రెస్ లో ఇక్కడివరకు వెళ్లడం చాలా కష్టం.
గర్భనిరోధక మాత్రలు:
ఈ రోజులలో గర్భనిరోధక మాత్రలను వాడే వారు చాలా మందే ఉన్నారు. వీటి వాడకం వల్ల అవాంఛిత గర్భం వచ్చే ప్రమాదం ఉండదు.
కానీ వీటిని వాడటం వల్ల మీ సెక్స్ డ్రైవ్ చాలా వరకు తగ్గుతుంది. హార్మోన్ల గర్భనిరోధకాలు శరీరంలో లిబిడో బూస్టర్ అయిన ఫ్రీ టెస్టోస్టెరాన్ మొత్తాన్ని బాగా తగ్గిస్తాయి.
దీంతో శృంగారంలో పాల్గొనాలన్న కోరిక తగ్గుతుంది. అయితే దీని ప్రభావం ఆడవాళ్లను బట్టి మారుతూ ఉంటుంది. కొంత మంది ఆడవారికి ఎలాంటి సమస్య రాదు.
అలెర్జీ, జలుబు మందులు:
యోని పొడిబారడం వల్ల కూడా మీ సెక్స్ డ్రైవ్ ప్రభావితం అవుతుంది.
కొన్ని మందుల వాడకం వల్ల కూడా లిబిడో తగ్గుతుంది. ముఖ్యంగా అలెర్జీ, జలుబు మందులలో కనిపించే యాంటిహిస్టామైన్లు యోని పొడిబారడానికి కారణమవుతాయి.
ఇది లిబిడోను తగ్గిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు నీటిని పుష్కలంగా తాగాలి. అలాగే సిలికాన్ ఆధారిత ల్యూబ్స్ ను సెక్స్ సమయంలో ఉపయోగించొచ్చు.
నొప్పి:
సెక్స్ లో పాల్గొన్నప్పుడు కొంతమంది ఆడవారికి కటి నొప్పి వస్తుంది. అలాగే అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది.
దీనివల్ల సెక్స్ లో పాల్గొనాలన్న కోరిక తగ్గుతుంది. యోని కండరాల ఇన్ఫెక్షన్లు, సంభోగానికి ముందు ఫోర్ ప్లే లో పాల్గొనకపోవడం వంటి కారణాల వల్ల ఇలా అవుతుంది. ఈ నొప్పి వల్ల సెక్స్ కోరిక తగ్గడం ప్రారంభమవుతుంది.
దీర్ఘకాలిక సంబంధం:
చాలా కాలంగా రిలేషన్షిప్ లో ఉండటం వల్ల కూడా శృంగారం పై ఇంటరెస్ట్ పోతుంది. ఇది మీకు రోజువారి పనిలాగే అనిపిస్తుంది. అందువల్ల కూడా మీకు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గడం మొదలవుతుంది.