అయితే ఏమి చేయాలో... తెలుసా...?
ట్రైన్ లో టికెట్ పోయిందా లేదా చిరిగిందా...?
ఇలాంటప్పుడు ఎం చేయాలో చాలా మందికి తెలియదు.
రైలులో ప్రయాణించడానికి మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ట్రైన్ టిక్కెట్ అవసరం.
జర్నీ సమయంలో మిమ్మల్ని TT లేదా TC అడిగితే మీరు టిక్కెట్ చూపించాలి.
మీ దగ్గర సరైన టిక్కెట్ లేకపోతే... మీపై చర్య తీసుకునే హక్కు TTకి ఉంది.
కానీ కొన్నిసార్లు రైలు టిక్కెట్లు ప్రయాణంలో మిస్ అవుతుంటాయి లేదా చిరిగిపోతుంటాయి.
అలాంటి సమయంలో... ముందు మీరు TTEకి తెలియజేయండి.
పోగొట్టుకున్న టిక్కెట్‌ను రీప్లేస్ చేయడానికి TT మీకు డూప్లికేట్ టిక్కెట్‌ను జారీ చేస్తారు
అయితే ఈ టిక్కెట్టు ఫ్రీగా ఇవ్వరు... ఒక్కో ట్రైన్ కి వేర్వేరుగా ఛార్జీలు చెల్లించాలి.
స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ ఇంకా ఇతర ట్రైన్స్
డూప్లికేట్ టికెట్ కోసం రూ.50 వసూలు చేయబడుతుంది.
టికెట్ చిరిగితే, ప్రయాణీకుడు టికెట్ మొత్తంలో 25 శాతం డూప్లికేట్ టికెట్ కోసం చెల్లించాలి.