TDP Government: చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్... ఎకరానికి 99 వేలు


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

పాడి రైతులే కాదు ఇతర చిన్న మరియు సన్నకారు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పోందవచ్చని అన్నారు.

పాల దిగుబడి పెంచడంతో పాటు రైతుల సంక్షేమంలో భాగమే 'ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు' పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 

ఈ పథకంలో చేరాలనుకునే రైతులు వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని మంత్రి సూచించారు.  

గత Tdp ప్రభుత్వ హయాంలోనే పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఈ "ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు"  పథకం అమలు చేసామని మంత్రి తెలిపారు. 

కానీ Ysrcp అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని నిలిపివేసారని అన్నారు.

ఈ పథకం అమలు చేయకపోగా పాల సేకరణలో నిబంధనలు విధించి పాడి రైతులను ఇబ్బందులకు గురి చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. 

ఈ పథకంలో భాగంగా చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులు పశుగ్రాసం పెంచడానికి అర్హులని తెలిపారు.

తమ భూమిలో కనీసం 25 సెంట్ల నుండి 2.5 ఎకరాల వరకు పశుగ్రాసంను పెంచవచ్చని తెలిపారు.

నిర్ణీత పొలంలో దుక్కిదున్నడం, విత్తనాలు వేయడం,నీటి సరఫరా మరియు ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం ప్రభుత్వమమే అందిస్తుందని అన్నారు.

ఈ పథకం ద్వారా పశుగ్రాసం పండించిన రైతుకు ఎకరాకు రూ.99వేల లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు. 

అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం అమలు చేయాలని ఉపాధి హామీ, పశు సంవర్ధక శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.